![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-93లో.. పెద్దోడి వివాహ పరిచయ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో సరిగ్గా అదే ప్రాంతానికి కళ్యాణ్‌ని పట్టుకోవడానికి ప్రేమ, ధీరజ్ వెళ్తారు. ఇక భద్రాద్రిలో దిగిన తరువాత వాళ్ళిద్దరు ఆటో ఎక్కుతారు. ప్రేమ ఆటో సీటు వెనుక కూర్చుని ఇబ్బంది పడుతూ ఉంటుంది. గట్టిగా నా చేయి పట్టుకుని కూర్చో లేదంటే పడతావ్ అని ధీరజ్ అంటే.. మాకు తెలుసులే అని ఓవరాక్షన్ చేస్తుంది. ఇంతలో డ్రైవర్.. ఆటోని గోతిలో పెడతాడు. దాంతో ప్రేమ తల టంగుమంటుంది. ఇక ఇరుకు ఇరుకుగా కూర్చోవడంతో.. ధీరజ్ వచ్చి ప్రేమపై పడుతుంటాడు.. ప్రేమ వెళ్లి ధీరజ్‌పై పడుతుంటుంది. అయిన ప్రేమ మాత్రం ధీరజ్‌కి టచ్ కాకుండా ఉండాలని చిరాకుపడుతుంటుంది. దాంతో ఆటో డ్రైవర్‌పై అరుస్తుంది. ఆటోని రోడ్డుపై నడుపుతున్నావా? ఇంకెక్కడైనా నడుపుతున్నావా? సరిగా చూసుకోమని ప్రేమ అరుస్తుంది.
ఏయ్.. ఓవరాక్షన్ చేయకు.. నీతో జర్నీ అంటే నాకూ చిరాకే.. మనం వెళ్తున్నది కళ్యాణ్ గాడి కోసం.. ఎక్స్ ట్రాలు చేయకుండా చేయి పట్టుకో లేదంటే.. కిందపడతావ్.. మూతిపళ్లు రాలతాయని ధీరజ్ అనగా.. ఇక వేరే ఆప్షన్ లేకుండా చేయిపట్టుకుంటుంది. మరోవైపు నర్మద అద్దం ముందు నిలబడి తెగ రెడీ అవుతుంటుంది. వెనుక నుంచి సాగర్ వచ్చి.. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ అంటూ సాంగ్ వేసుకుంటాడు. ఇక కాసేపు నర్మద, సాగర్ లు రొమాంటిక్ సాంగ్ వేసుకుంటారు.
మరోవైపు రామరాజు అండ్ కో కలిసి స్వయంవరానికి వెళ్తారు. ఇంతలో వేదవతి.. చందును చూస్తూ.. రేయ్ పెద్దోడా.. ఇంతమందిలో నీకు కాబోయే భార్య ఎక్కడుందో మన ఇంటి పెద్ద కోడలిగా ఎవరికి రాసిపెట్టి ఉందోనని అంటుంది. ఇంతలో వల్లి ఎంట్రీ ఇచ్చేస్తుంది. గెటప్పూ సెటప్పూ మొత్తం మార్చేసి మారువేషంలో ఎంట్రీ ఇస్తారు. మొదటిసారి కారు ఎక్కడంతో.. కనీసం కారు డోరు కూడా తీయడం రాదు భాగ్యం. అది గమనించిన డ్రైవర్.. కారు ఎక్కడం ఫస్ట్ టైమా అని గాలి తీసేస్తాడు. అమ్మోయ్.. మనం నిజంగానే డబ్బున్న వాళ్లలాగే ఉన్నామే అని తెగ మురిసిపోతుంది. వామ్మో వామ్మో ఇంతమంది ఉన్నారేంటే... మన బస్తీలో చేపల సంతకంటే బీభత్సంగా ఉందే.. మనకి కావాల్సిన పెళ్లికొడుకు దొరుకుతాడా అని వల్లి అంటుంది. నీకు ఒకటో నెంబర్ పెళ్లి కొడుకుని చూస్తానే.. నువ్వు ఏది చెప్పినా గొర్రెలా తలాడించేవాడ్నే చూస్తాను. అత్తారింటిని ఆ ఇంటి పెత్తనాన్ని నీ గుప్పెట్లో పెడతాను.. వాళ్ల ఆస్తిని మెల్లి మెల్లిగా మన ఇంటికి తరలించేస్తాను.. మరి నువ్వేం అంటావని భాగ్యం అంటుంది. నువ్వు ఏంటంటే నేనూ అదే అంటానని వల్లి అంటుంది.
ఇక శ్రీవల్లికి రిజిస్టర్ చేయించి లోపలికి వస్తుంది భాగ్యం. వామ్మో ఇంతమంది ఉన్నారేంటి? వీళ్లల్లో మనకి కాబోయే బకరా ఎక్కడున్నాడో ఏంటోనని శ్రీవల్లి అంటుంది. ఆ బకరా ఎక్కడో కాదు.. శ్రీవల్లి వెనుకే ఉంటాడు. ఇక్కడున్న బకరాగాళ్లలో ఏ క్లాస్ బకరా గాడ్ని బయటకు తీయాలి మనం. ఎక్కడున్నాడోనని భాగ్యం వెతుకుతుంటుంది. ఇంతలో స్వయంవర వివాహ పరిచయ వేదిక పరిచయ కార్యక్రమం మొదలౌతుంది. తరువాయి భాగంలో ఎతకబోయిన రైస్ కుక్కర్ ఈల వేసుకుంటూ వచ్చేసినట్టుగా.. మనం వెతుకుతున్న ఆ బకరాగాడు వీడే అదిగో మనకి కావాల్సిన పప్పు సుద్దగాడు అంటూ చందుని సెలెక్ట్ చేసేస్తుంది భాగ్యం. నాకు కాబోయే అత్తమామల్ని అమ్మనాన్నలుగా చూసుకుంటానంటూ ఒక్క మాటతో రామరాజు ఫ్యామిలీని పడేస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |